Revanth Reddy: ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Telangana Assembly Elections Schedule) విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిందన్నారు. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతోందన్నారు. రాబోయే విజయదశమిని ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో లక్ష కోట్లు, పదివేల ఎకరాల భూములను కేసీఆర్ (KCR) కుటుంబం ఆక్రమించుకుందని ఆరోపించారు. ఆఖరికి అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: చివరికి తెలంగాణ ఎలక్షన్స్.. బీజేపీకి అడ్వాంటేజ్?
Revanth Reddy: డిసెంబర్ లో అద్భుతం.. ఆ రోజున రాష్ట్రానికి విముక్తి: రేవంత్ రెడ్డి
ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందన్నారు. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతోందని వాఖ్యానించారు రేవంత్.

Translate this News:











