తెలంగాణలో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్స్ ను (Telangana Election Schedule) ఈ రోజు విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC). నవంబర్ 7వ తేదీన మిజోరాం, ఛత్తీస్ ఘడ్ ఫస్ట్ ఫేజ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్ ఘడ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు నవంబర్ 17న నిర్వహించనున్నారు. రాజస్థాన్ లో నవంబర్ 23న, తెలంగాణలో ఆఖరిగా నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. అయితే.. తెలంగాణ ఎన్నికలు చివరిగా జరగడం బీజేపీకి (BJP) కలిసివచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. 4 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు మకాం మార్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Telangana Elections: చివరికి తెలంగాణ ఎలక్షన్స్.. బీజేపీకి అడ్వాంటేజ్?
ఎన్నికల కమిషన్ ఈ రోజు మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూళ్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కన్నా చివరిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందన్న చర్చ సాగుతోంది.

Translate this News:











