డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ జనగర్జన (BJP Janagarjana) బహిరంగ సభకు హాజరైన అమిత్ షా మాట్లాడుతూ.. గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ (CM KCR) నెరవేర్చలేదన్నారు. నేటి తరం ఆధునిక రజాకార్ల నుంచి తెలంగాణను రక్షించేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా అన్నారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందన్నారు. పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఏనాడు పేదలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గిరిజనులకు మూడు ఎకరాలు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీకి పదేళ్లుగా కేసీఆర్ భూమి ఇవ్వలేదని ఆరోపించారు. ఆదిలాబాద్ ఆదివాసీలకు కేసీఆర్ ఏం చేయలేదని ఆరోపించారు. పేద గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: చివరికి తెలంగాణ ఎలక్షన్స్.. బీజేపీకి అడ్వాంటేజ్?
BJP Jana garjana: డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కార్: అమిత్ షా
కేసీఆర్ ఒక్క హమీని కూడా నెరవేర్చలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. ఈ రోజు ఆదిలాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన అమిత్ షా మాట్లాడుతూ.. గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. నేటి తరం రజాకార్ల నుంచి తెలంగాణను రక్షించేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా అన్నారు.

Translate this News:











