Andhra Pradesh: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనపై సీపీఐ(CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా(D Raja) తీవ్ర విమ్శలు చేశారు. సేవ్ ఇండియా- ఛేంజ్ ఇండియా నినాదంతో ప్రజల్లోకి వెళతామని అన్నారు. శుక్రవారం నాడు తిరుపతిలో సీసీఐ చేపట్టిన బస్సు యాత్ర ముగింపు సభకు డి. రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రూ. 15 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అవినీతిపరులు దోచేశారని ఆరోపించారు. కోట్ల రూపాయలు దోచుకుని విదేశాలను వదిలి వెళ్ళిపోయారన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ పేరుకే తప్ప.. దేశంలో ఎక్కడా కనిపించడం లేదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చలు జరగడం లేదన్నారు. ప్రత్యేక పార్లమెంట్ పేరుతో కాలయాపన చేయడమే తప్ప.. ప్రజల సమస్యలు వారు అస్సలు వినరంటూ ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు డి. రాజా.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: రూ. 15 లక్షల కోట్లు దోచుకెళ్లారు.. కేంద్ర ప్రభుత్వంపై డి. రాజా షాకింగ్ కామెంట్స్..
వన్ నేషన్-వవన్ ఎలక్షన్ అంటే ఏంటో స్పష్టంగా మోడీ చెప్పగలడా..? అని నిలదీశారు. అంబేద్కర్ రాజ్యాంగం గురించి మోడీ తెలుసుకుంటే వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి మళ్ళీ మాట్లాడరని వ్యాఖ్యానించారు.

Translate this News:











