Heath Streak not dead: ఉదయం నుంచి జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ మరణించారనే వార్త క్రికెట్ అభిమానులను ఆవేదనకు గురిచేసింది. స్ట్రీక్ ఆత్మకు శాంతి కలగాలని చెబుతూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పోస్టులు కూడా చేస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ హ్యాపీ న్యూస్ బయటకు వచ్చింది. స్ట్రీక్ బతికే ఉన్నారని.. ఆయన మరణించలేదని సహచర ఆటగాడు హెన్రీ ఒలంగా క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు. ‘హీత్ స్ట్రీక్ చనిపోయాడన్న పుకార్లు మరీ ఎక్కువయ్యాయి. నేను ఇప్పుడే అతడితో మాట్లాడాను. మూడో అంపైర్ అతడిని మళ్లీ వెనక్కి పిలిచాడు. స్ట్రీక్ బతికే ఉన్నాడు అంటూ ట్విట్టర్లో తెలిపాడు. ఈ ట్వీట్‌కు స్ట్రీక్ తో చేసిన వాట్సాప్ చాట్ కూడా షేర్ చేశాడు.
పూర్తిగా చదవండి..Heath Streak: జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన ఒలంగా
జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ బతికే ఉన్నారు. స్ట్రీక్ మరణించలేదని.. కొద్దిసేపటి క్రితమే తనతో మాట్లాడినట్లు సహచర ఆటగాడు హెన్రీ ఒలంగా స్పష్టంచేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Translate this News:











