YSRTP Merging in Congress: తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని (YSRTP) కాంగ్రెస్ పార్టీలో(Congress) విలీనం అంశం దాదాపు ఖరారైంది. హస్తం పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఫిక్స్ అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విలీనంపై ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా వైఎస్ షర్మిలకు కీలక పదవి ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తారని సమాచారం అందుతోంది. కాగా, కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీని విలీనం చేసే అంశంపై కాంగ్రెస్కు నేటి వరకు డెడ్లైన్ విధించారు. ఆ డెడ్లైన్ ఇవాళ్టితో ముగిసింది. షర్మిల విధించిన డెడ్లైన్ ముగియడంతో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీని విలీనం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది.
పూర్తిగా చదవండి..YSRTP Merging in Congress: కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం ఫిక్స్! ప్రకటించనున్న రాహుల్ గాంధీ?
తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం అంశం దాదాపు ఖరారైంది. హస్తం పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఫిక్స్ అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విలీనంపై ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు.

Translate this News:











