YS Sharmila in Hunger Strike: వైసీపీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహారదీక్షకు దిగారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఆమె దీక్ష చేయనున్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) నియోజకవర్గం పర్యటనకు పోలీసులు అనుమతించకుండా హౌస్ అరెస్ట్ చేయడంతో నిరసనగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. లోటస్‌పాండ్ నివాసం నుంచి షర్మిల బయటకు రాకుండా పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె పర్యటన వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది అని భావించిన పోలీసులు పర్యటనకు అనుమతి లేదని తెలిపారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన షర్మిల పోలీసులకు హారతి ఇచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. తాను పర్యటన చేసి తీరుతానని తేల్చిచెబుతున్నారు. దళిత బందు పథకంలో (Telangana Dalit Bandhu) అక్రమాలు జరిగాయని ఇటీవల జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామాల్లో ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో పర్యటించి స్థానికులకు మద్దతు తెలపాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..YS Sharmila: వైఎస్ షర్మిల నిరాహార దీక్ష, లోటస్ పాండ్ దగ్గర హై టెన్షన్ !!
వైసీపీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గమై గజ్వేల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు లోటస్‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Translate this News:











