CM Jagan: వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతోందన్నారు సీఎం జగన్..ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలు, మోసాలు నమ్మొదన్న జగన్.. పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. తనకు వేసే ప్రతీ ఓటూ పెదవాళ్లను కాపాడుకోవడం కోసం కోసమే అన్న జగన్.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఈ విషయాల్ని రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినడానికే ప్రతిపక్షాలకు అధికారం కావాలన్న జగన్.. అది తన విధానం కాదన్నారు. తాను దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని అన్నారు.
పూర్తిగా చదవండి..CM Jagan: దోచుకోవడానికే వారికి అధికారం.. రానున్నది కురుక్షేత్రమే: సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతోందన్నారు సీఎం జగన్.పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. దోచుకోవడానికీ, పంచుకోవడానికీ, తినడానికే ప్రతిపక్షాలకు అధికారం కావాలని జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం RTC డిపో దగ్గర్లో ఉన్న మినీ స్టేడియంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఆనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

Translate this News:











