ఖమ్మం జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల హాడావుడి షురూ అయ్యింది. తాజాగా వైఎస్సార్టీపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ ఖమ్మ జిల్లా నుంచే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు డిసైడ్ అయ్యారు. అయితే తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలో నేడు పాలేరుకు వైఎస్సార్టీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెళ్లనున్నారు. పాలేరు నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరు కానున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పాలేరు నుంచి విజయమ్మను బరిలో దించాలని షర్మిల యోచిస్తోంది. ఇందులో భాగంగానే నేడు కార్యకర్తల సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
పూర్తిగా చదవండి..TS Elections 2023: బిగ్ ట్విస్ట్.. పాలేరు బరిలో వైఎస్ విజయమ్మ..కొత్తగూడెం నుంచి షర్మిల!
ఇన్నాళ్లూ పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పిన వైఎస్ షర్మిల.. తాజాగా తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆమె డిసైట్ అయినట్లు సమాచారం. పాలేరు నుంచి వైఎస్ విజయమ్మను బరిలోకి దించాలని షర్మిల నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Translate this News:











