వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, పార్టీ కార్యకర్తలకు మద్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. షర్మిలను హయత్ నగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో చిత్రహింసలకు గురైన మహిళా బాధితురాలను ఆమె పరామర్శించారు. బాధితురాలికి వెంటనే రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని.. లక్ష్మిపై థర్డ్ డిగ్రీ ఘటనపై వెంటనే విచారణ కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఇక్కడే ధర్నా చేస్తున్నానని వెల్లడించారు. ఈ క్రమంలో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు
గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసుల దాడి అమానుషమని వైసీటీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్ధరాత్రి మహిళ స్వేచ్చగా తిరిగినప్పుడే మనకు అసలైన స్వతంత్రం అని గాంధీజి అన్నారని.. మరి ఇప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చినట్లా? రానట్లా? అని ప్రశ్నించారు.

Translate this News:











