వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు ఆమె తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న షర్మిల ఓ స్కూల్లోని విద్యార్థులతో కలిసి సందడి చేశారు. రేపు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సమేతంగా నివాళులు అర్పించనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గురువారం ఢిల్లీ వెళ్లి మరి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి పార్టీ విలీనంపై చర్చించిన సంగతి తెలిసిందే. దీంతో తన తండ్రి వర్థంతి రోజున విలీనం గురించి ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Sharmila: ఇడుపులపాయలో షర్మిల.. కాంగ్రెస్లో విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం!
వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు ఆమె తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న షర్మిల ఓ స్కూల్లోని విద్యార్థులతో కలిసి సందడి చేశారు.

Translate this News:











