యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి పార్టీ కార్యాకలాపాలకు భంగం కలిగించాడని, అందుకే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో ఉంటూనే కార్యకర్తలను కన్ఫ్యూస్ చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ బిక్ష పెట్టిన బీజేపీ పార్టీపైనే అక్కసు వెళ్లగక్కుతున్నాడని కిషన్ రెడ్డి మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డిది ఒకచోట కుదురుగా ఉండే వ్యక్తిత్వం కాదన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సమయంలో ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినట్లు గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేశారు
యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో ఉంటూ.. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. అందుకే అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Translate this News:











