రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి.. సాయంత్రం బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా 70 శాతం బీసీ, ఎస్సీ మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధిక మెజార్టీతో గెలిపించి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను అభ్యర్థిస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర 27న గజపతినగరం, మూడో రోజు భీమిలి, పాడేరు, పార్వతీపురం, మాడుగుల, ఎస్ కోట, అనకాపల్లితో యాత్ర ముగస్తుందని, రెండో దశ బస్సుయాత్ర దీపావళి తర్వాత మొదలవుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, గిరిజన, మైనారిటీలు మద్దతివ్వాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.
పూర్తిగా చదవండి..AP Politics: టీడీపీపై మండిపడ్డ బొత్స, వైవీ సుబ్బారెడ్డి..బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్తామని వెల్లడి
ఏడాది కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది, ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్రను చేపట్టనున్నారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఈ సామాజిక సాధికార బస్సుయాత్ర కొనసాగుతుందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Translate this News:











