CM Jagan New Strategy: ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఎపిసోడ్ కలకలం రేపుతోంది. నిన్నటి వరకు ప్రజల్లో ఉంటూ.. అన్నీ తానై తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మోసిన చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంతో.. రాష్ట్ర రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్ట్‌ను సమర్థించే వాళ్లు కొందరైతే.. వ్యతిరేకించేవాళ్లు మరికొందరు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఆయన తరపు లాయర్లు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడంలేదు. మరోవైపు వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబును జైలుకే పరిమితం చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే ప్రచారం సాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చినా.. మిగిలిన కేసుల్లో పిటి వారెంట్ జారీచేసి చంద్రబాబును జైల్లోనే ఉంచేలా ఏపీ ప్రభుత్వం స్కెచ్ వేసిందనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే ఇన్నర్‌రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ఇప్పటికే పోలీసులు పిటిషన్ ఫైల్ చేశారు. దీంతో చంద్రబాబును ఇప్పటిలోగా ప్రభుత్వం వదిలేలా లేదనే చర్చ జరుగుతోంది.
పూర్తిగా చదవండి..Jagan New Strategy: అప్పటివరకు చంద్రబాబు జైల్లోనేనా..! వైసీపీ స్కెచ్ ఇదేనా?
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు(Chandrabu) ఎపిసోడ్ కలకలం రేపుతోంది. నిన్నటి వరకు ప్రజల్లో ఉంటూ.. అన్నీ తానై తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మోసిన చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంతో.. రాష్ట్ర రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్ట్‌ను సమర్థించే వాళ్లు కొందరైతే.. వ్యతిరేకించేవాళ్లు మరికొందరు.

Translate this News:











