రాజమహేంద్రవరంలో విద్యానగర్‌లోని నారా లోకేష్ క్యాంప్ సైట్లో యనమల రామకృష్ణుడు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యం గురించి జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి ఇచ్చిన నివేదికలో ఏముంది.? ఏ రిపోర్టులు చూసి ఆరోగ్యం బాగుందని బులిటెన్ బయటకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. కనీస పరీక్షలు చేయలేదు..రక్త పరీక్ష కూడా చేయలేదని ఆరోపించారు. ఆరోగ్యం బాగోలేకనే చర్మంపై దద్దుర్లు, అలర్జీ వచ్చిందన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై మొదటి నుంచి ప్రభుత్వం, అధికారులు తప్పుడు సమాచారం బయటకు ఇస్తున్నారని ఆరోపించారు. హెల్త్ బులిటెన్ ఇచ్చినప్పుడు సంబంధిత అధికారులు విడుదల చేయాలన్నారు. కానీ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు పరిశీలించినట్లుగా ఆరోగ్య బులిటెన్‌లో లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముద్దాయి అన్న పదం వాడారు తప్పా.. డాక్టర్లు పరీక్షలు చేసినట్లు బులిటెన్‌లో లేదన్నారు.
పూర్తిగా చదవండి..AP Politics: చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత.. యనమల సంచలన ప్రెస్ మీట్
రాజమహేంద్రవరం కేంద్ర కాగారారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు.

Translate this News:











