Yanamala Rama Krishnudu: ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అవినీతి చేశారని..అవినీతి అనుకొండ అని..ఇలా వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. అయితే, వైసీపీ మంత్రుల మాటలకు టీడీపీ యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)గట్టి కౌంటర్ ఇచ్చారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన సీఎం జగనే అసలైన ఆర్థిక నేరస్తుడని టీడీపీ యనమల రామకృష్ణుడు ఘాటుగా స్పందించారు.
పూర్తిగా చదవండి..Yanamala Rama Krishnudu: అసలైన ఆర్థిక నేరస్తుడు ఎవరంటే..?
అసలైన ఆర్థిక నేరస్తుడు సీఎం జగన్(CM Jagan)అని టీడీపీ(TDP) యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) మండిపడ్డారు. తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని బినామీ లావాదేవీలతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను ఆర్థిక నేరస్తుడిగా చూపించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కేవలం ఒక్క రోజైనా చంద్రబాబును జైల్లో పెట్లాలనే ఆతృత తప్ప ఈ కేసులో ఏమాత్రం పస లేదని ఎద్దేవా చేశారు.

Translate this News:












