‘గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ…’ అని టీచర్లను దేవుడిగా పూజించే దేశం మనది. మన జీవితంలో విద్యార్థి దశ నుంచి టీచర్ల పాత్ర మొదలవుతుంది. మనం వేసే ప్రతి అడుగులోనూ గురువు ఉంటాడు. చాలా మంది టీచర్లు(Teachers) మంచి విషయాలే బోధిస్తారు. ఎక్కడో కొందరు తప్ప అంతా మంచే నేర్పుతారు. బాల్యం నుంచే మన టీచర్ల ప్రభావం మనపై కనిపిస్తుంది. మన ఎదుగుదలకు కారణమయ్యే టీచర్లను స్మరించుకునేందుకు సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా టీచర్స్ డే జరుపుకుంటారు.. అక్టోబర్ 5న(రేపు) ప్రపంచ టీచర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు మన జీవితాలను రూపొందించడంలో, మార్చడంలో ఉపాధ్యాయులు పోషించే పాత్రను గౌరవిస్తుంది. మన తల్లిదండ్రుల తరువాత, సమాజానికి సానుకూలంగా దోహదపడే పెద్దలు టీచర్లే. అలాంటి టీచర్లకు తక్కువ జీతాలు ఇస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి.
పూర్తిగా చదవండి..World Teacher’s day: గౌరవం ఉంది.. జీతాలే లేవు.. ఇండియాలో టీచర్ల శాలరీలు ఇంత తక్కువా?
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏటా అక్టోబర్ 5న వస్తుంది. విద్యార్థి దశ నుంచే జ్ఞానంతో పాటు జీవితంలో వెలుగులు నింపే టీచర్‌కు ఇండియాలో శాలరీలు చాలా తక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది భారతీయ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ లేకుండానే పనిచేస్తుండగా.. వారి జీతం నెలకు సగటున రూ.10వేలు మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Translate this News:













