వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. టోర్నీలో ఇప్పటివరకు అసలు ఓటమే ఎరుగని జట్టు భారత్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అదరగొడుతోన్న భారత్ జట్టు టేబుల్ టాపర్‌గా ఉన్న న్యూజిలాండ్‌ను చిత్తు చేసి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. ఈ మ్యాచ్ గెలుపునతో టీమిండియా 20ఏళ్ల నిరీక్షణకు తెరదించినట్టు అయ్యింది. వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ చివరి సారిగా 2003లో గెలిచింది. అప్పటినుంచి ఐసీసీ టోర్నమెంట్లలో కివీస్‌పై భారత్ గెలవలేదు. 14 మార్చి,2003న ఈ మ్యాచ్ జరిగింది.
పూర్తిగా చదవండి..World cup 2023: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. న్యూజిలాండ్‌పై మనం చివరి సారి గెలిచినప్పుడు గిల్ వయసు 4 ఏళ్లే!
ఐసీసీ టోర్నమెంట్లలో 20ఏళ్ల నిరీక్షణకు భారత్ తెరదించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కివీస్‌పై మార్చి,14 2003 తర్వాత ఐసీసీ టోర్నమెంట్లలో గెలవలేదు. ఆ సమయానికి గిల్ వయసు 4ఏళ్లేనంటూ సోషల్‌మీడియాలో ట్వీట్లు షేర్ అవుతున్నాయి. అప్పటికీ సచిన్ 65 అంతర్జాతీయ సెంచరీలు మాత్రమే చేసి ఉన్నాడంటూ ట్వీట్లు వేస్తున్నారు.

Translate this News:











