క్రికెట్లో గంభీర్ రూటు సపరేటు.. టీమిండియాకు వరల్డ్‌కప్(టీ20, వన్డే) రావడంతో కీలక పాత్ర పోషించిన గంభీర్ ఆటను తీసి పడేసేలాగా ఎవరైనా మాట్లాడితే అది కచ్చితంగా కోపం లేదా అసూయతో వచ్చిన మాటలే కానీ వాటిలో ఏ మాత్రం నిజం ఉండదు. అయితే విన్నింగ్ క్రెడిట్ల విషయంలో ధోనీ ఫ్యాన్స్ అతిగా బిహేవ్ చేస్తుంటారని.. అతని పీఆర్ టీమ్ వల్ల 2011 ప్రపంచకప్ గెలుపు క్రెడిట్ ధోనీ ఖాతాలోకి వెళ్లిందని గంభీర్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అది ధోనీ గెలుపు కాదు అని.. టీమిండియా గెలుపు అని కుండబద్దలు కొట్టడంలో గంభీర్ స్టైల్ వేరు. ఇటు కోహ్లీని విమర్శించడంలోనూ గంభీర్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇలా వివిధ కారణాలతో గంభీర్‌ని హేట్ చేసే టీమిండియా అభిమానులు పెరిగిపోయారు. అతడిని, అతని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయినా గంభీర్ ఇవేమీ పట్టించుకోడు. తాను చెప్పాలనుకున్నది నేరుగా చెప్పేస్తాడు. అందుకే అతడిని తప్పుగా అర్థం చేసుకునేవాళ్లే ఎక్కువ. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పూర్తిగా చదవండి..World cup 2023: ధోనీ ఫ్యాన్స్‌కు అశ్విన్ ఝలక్.. గంభీర్ గురించి అలా మాట్లాడతారా?
ఇటివలి కాలంలో ధోనీ, కోహ్లీపై విమర్శలు చేస్తూ క్రికెట్ అభిమానుల ట్రోలింగ్‌కు గురవుతున్న మాజీ స్టార్ ఓపెనర్ గంభీర్‌పై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతను ఎల్లప్పుడూ జట్టు గురించి ఆలోచించే నిస్వార్థ వ్యక్తి అని అశ్విన్ కొనియాడారు. గంభీర్ టీమ్ మ్యాన్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

Translate this News:











