తండ్రికి తగ్గ తనయుడు అనే నానుడిని నిజం అని నిరుపించాడు నెదర్లాండ్ స్టార్స్ ప్లేయర్ బాస్ డి లీడే(Bas de Leede). నాడు తండ్రి చేసిన బౌలింగ్‌ని మరిపిస్తూ, మెరిపిస్తూ పాక్ బ్యాటర్ల వెన్ను విరిచాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్‌లో లీడే ఆట గురించి యావత్ క్రికెట్ ప్రపంచం చర్చించుకుంటోంది. బాల్తోనే కాకుండా బ్యాట్‌తోనూ మెరిసిన లీడే గురించి ఓ న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడే 20 ఏళ్ల తర్వాత ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో తన తండ్రి టిమ్(TIM) ప్రదర్శనను గుర్తు చేశాడు.
పూర్తిగా చదవండి..World cup 2023: నాడు తండ్రి.. నేడు కొడుకు.. సచిన్, రిజ్వాన్‌లను బోల్తా కొట్టించిన తండ్రీకొడుకులు!
నెదర్లాండ్స్ మాజీ స్టార్ ప్లేయర్ టిమ్ బాటలోనే అతని కొడుకు లీడే ప్రయాణిస్తున్నాడు. 2003 ప్రపంచకప్‌లో టీమిండియాలో పై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు టిమ్. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు టిమ్ కొడుకు లీడే. నాడు సచిన్ లాంటి టాప్ బ్యాటర్‌ని టిమ్ బోల్తా కొట్టిస్తే ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌ని అవుట్ చేశాడు లీడే.

Translate this News:












