ICC World Cup 2023: వివిద దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లు ఒక ఎత్తు.. భారత్-పాక్(IND vs PAK) మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ మరో ఎత్తు. భారత్-పాక్ మ్యాచ్ అంటే చాలు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్(Cricket) అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు. మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లి మరీ టికెట్ కొనుగోలు చేసి వీక్షిస్తారు. అలా వీలుకాని వారు ఇంట్లో టీవీల్లోనో, మొబైళ్లలోనూ చూస్తారు. ఇక దాయాది దేశాల క్రికెట్ పోరును గల్లీలలో ప్రొజెక్టర్లు వేసి మరీ వీక్షించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, త్వరలో జరుగనున్న పురుషుల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మధ్య కూడా మ్యాచ్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లకు సంబంధించి టికెట్ల విక్రయం ప్రక్రియ నడుస్తోంది.
పూర్తిగా చదవండి..India vs Pakistan: అట్లుంటది మరి ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. టిక్కెట్ ధర రూ. 57 లక్షలు..!
వరల్డ్ కప్ 2023లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు సెకండరీ మార్కెట్లో రూ. 57 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇందుకు సంబందించిన వివరాలను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య క్రేజ్ ఆ రేంజ్లో ఉండొచ్చు గానీ.. మరీ ఇంత ధర ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Translate this News:














