World Cup 2023 India vs Pakistan: మామూలుగాను భారత్-పాక్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీన్ని మరింత హైలెట్ చేయాలని చూస్తోంది బీసీసీఐ (BCCI). మ్యాచ్ ముందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందని తెలుస్తోంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో ఇండియా-పాకిస్తాన్ ఆట ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ నరేంద్రమోడీ మైదానం (Narendra Modi Stadium). ఇందులో ఇప్పటికే ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఇప్పుడు రెండో సమరానికి ఇది రెడీ అవుతోంది. 1,32 వేలమంది కూర్చోగలిగే సామర్ధ్యం ఉన్న నరేంద్రమోదీ మైదానం మెగా మ్యచ్ కోసం ముస్తాబవుతోంది.
పూర్తిగా చదవండి..World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్‌కు బీసీసీఐ హడావుడి..ప్రత్యేక కార్యక్రమం ప్లానింగ్
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఓ లెవల్ లో ఉంటుంది. దేశభక్తి ఏరులై ప్రవహిస్తుంది. భారతీయుల్లో ఎక్కడలేని ఉత్సాహం కట్టలు తెంచుకుని వచ్చేస్తుంది. అందులోను వరల్డ్‌కప్ అంటే ఇంక చెప్పనే అక్కర్లేదు. అక్టోబర్ 14న ఇండియా-పాక్ మ్యాచ్ ఉంది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ కు బీసీసీఐ హంగులద్దుతోందని సమాచారం.

Translate this News:











