Criticism over R Ashwin inclusion in team: వరల్డ్‌కప్(world cup) ప్రధాన మ్యాచ్‌లు అక్టోబర్ 5నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీ ప్రారంభానికి ముందు అక్షర్ పటేల్(Axar Patel) టీమిండియాకు దూరం అవ్వడం అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) సెలక్ట్ కావడం చాలామందిని షాక్‌కి గురి చేసింది. ఎందుకంటే అశ్విన్ టీమిండియా తరఫున వన్డేలు ఆడి ఏళ్లు గడిచిపోయాయి. ఈ ఆరేళ్లలో కేవలం నాలుగు వన్డేలే ఆడాడు అశ్విన్. టెస్టుల్లో నంబర్-1 బౌలర్ ఐనప్పటికీ వన్డేల్లో మాత్రం అశ్విన్ యాక్టివ్ ప్లేయర్ కాదు. అయినా అశ్విన్ అనుభవాన్ని చూపించి జట్టులో అతని స్థానాన్ని సమర్థించుకుంది బీసీసీఐ. అయితే అశ్విన్ స్థానాన్ని ప్రశ్నించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వన్డే ప్రపంచ కప్‌కు అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్‌ని సెలక్ట్ చేయడాన్ని ఇప్పటికే టీమిండియా 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్‌సింగ్ ప్రశ్నించగా.. తాజాగా ఆ జాబితాలో భారత మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్(Laxman Shivaramakrishnan) చేరిపోయాడు. అశ్విన్‌ని ఏకంగా మూర్ఖుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
పూర్తిగా చదవండి..World Cup 2023: ‘మూర్ఖుడు’, ‘అనర్హుడు..’ ఆ పిచ్‌లపై ఎవడైనా వికెట్లు తీస్తాడు..ఇదేం తిట్టుడు భయ్యా!
అక్షర్ పటేల్ స్థానంలో టీమిండియా వరల్డ్ కప్ జట్టుకు వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ని సెలక్ట్ చేయడాన్ని పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. ఇండియాలో ఉండే స్పిన్ టాంపరింగ్ పిచ్‌లపై ఏ మూర్ఖుడైనా వికెట్లు తియ్యగలడాని అశ్విన్‌పై చిందులువేశాడు భారత్ మాజీ ఆటగాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్. అశ్విన్‌కి బదులు వాషింగ్టన్ సుందర్‌ని సెలక్ట్ చేసి ఉండాల్సిందని ఇప్పటికే యువరాజ్ సింగ్ సైతం అభిప్రాయపడ్డాడు.

Translate this News:











