World Athletics Championships 2023 : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) మరోసారి భారత్ పేరు మారుమ్రోగించాడు. హంగేరీలోని (Hungary) బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం (Gold Medal) సాధించి చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా 88.17 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ చోప్రా తొలిసారి ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఒలింపిక్ ఛాంపియన్ (Olympics) ఫైనల్లో మరో 11 మంది ఆటగాళ్లను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. నీరజ్ చోప్రా ఈ పతకంతో పాటు భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. ఇంతకు ముందు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏ భారతీయ అథ్లెట్ స్వర్ణం సాధించలేదన్న సంగతి తెలిసిందే. 2022లో కేవలం రజత పతకంతో సరిపెట్టుకోవాల్సిన నీరజ్ ఈసారి మాత్రం తన పతకం రంగు మార్చుకోవడంలో సఫలమయ్యాడు.
పూర్తిగా చదవండి..World Athletics Championships 2023 : గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డ్..!!
స్టార్ ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా రికార్డు క్రియేట్ చేశాడు. నీరజ్ చోప్రా మొదటి త్రోలో ఫౌల్ చేసినా తన రెండవ ప్రయత్నంలో వచ్చిన 88.17 మీటర్ల అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు.

Translate this News:











