సీఎం కేసీఆర్ దళితుణ్ని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్ 2014లో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సమయంలోనే దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ ప్రకటించారన్న ఆయన.. ఆ హామీని నెరవేర్చలేదన్నారు. అంతే కాకుండా 2018 ఎన్నికల ముందు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. 2018లో ఇచ్చిన హామీని సైతం నెవేర్చలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ గతంలో ఎలాంటి హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోవాలని సూచించారు.
పూర్తిగా చదవండి..MLC Jeevan Reddy: కేసీఆర్ దళితుణ్ని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ క్యాబినెట్లో ఎంతమంది దళితులు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వని కేసీఆర్కు ఓట్లు అడిగే హక్కులేదన్నారు.

Translate this News:











