ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలు తమ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విమర్శలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓవైపు చంద్రబాబు అరెస్టు అవ్వడం, టీడీపీ జనసేన పొత్తు ఖరారు కావడంతో రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం అటు టీడీపీ జనసేన కంటే.. ఎక్కువ స్థాయిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. ఆమె అధ్యక్షురాలు అయినప్పటి నుంచి తనదైన శైలిలో వైసీపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటి వరకు వైసీపీ అనుకూలం అనే ముద్ర వేసుకున్న ఏపీ బీజేపీ.. ఆ ముద్రను చెరిపేసుకోవాలనే తాపత్రయంతో పురందేశ్వరి ఇలా వ్యవహరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే టార్గెట్ వైసీపీగా పురందేశ్వరి వ్యవహార శైలి,ఆ పార్టీ కార్యక్రమాలు ఉంటున్నాయి.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: దూకుడు పెంచుతున్న పురందేశ్వరి.. కారణమేంటి?
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దూకుడు పెంచుతున్నారు. ఆమె అధ్యక్షురాలు అయినప్పటి నుంచి తనదైన శైలిలో వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఆమె టీడీపీ మైలేజ్ పెంచడం కోసమే ఇలా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి పురందేశ్వరి చూపిస్తున్న దూకుడు.. సొంత పార్టీ కోసమా లేక టీడీపీ కోసమా అనేది చర్చనీయాంశంగా మారింది.

Translate this News:











