The jump in corona virus cases is mostly fueled by reported infections from South Korea: కరోనా ముప్పు పోయిందని రిలాక్స్ అవుతున్నారా? మాస్కులు తీసి పడేసి తిరుగుతున్నారా? గ్రూపులుగా పార్టీలు చేసుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీ కోసమే.. ఈ ఒక్క నెలలోనే (30 రోజులు) ప్రపంచవ్యాప్తంగా 80శాతం కేసులు పెరిగాయట..! ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని WHO బాంబు పేల్చింది. దక్షిణకొరియాలో మొదలైన కరోనా వ్యాప్తి క్రమక్రమంగా ఇతర దేశాలకు కూడా పెరుగుతుందని చెప్పింది. ఈ నెల రోజుల్లో మొత్తం 103దేశాల్లో కనీసం ఒక్క కరోనా కేసు నమోదైనట్టు WHO తెలిపింది. ఇది ప్రపంచదేశాల సంఖ్యలో 44శాతం (మొత్తం 234దేశాలు). జులై 10 నుంచి ఆగస్టు 6 మధ్య ప్రపంచవ్యాప్తంగా 15లక్షల కేసులు రికార్డయ్యాయి. అందులో 12లక్షల కరోనా కేసులు కేవలం దక్షిణ కొరియా నుంచి నమోదయ్యాయి.
పూర్తిగా చదవండి..Corona: ఈ కరోనా కజిన్‌తో ముప్పు తప్పదా? కొత్త వేరియంట్‌తో కసికసిగా కొవిడ్ కాటు!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 30 రోజుల్లో కొవిడ్ కేసులు 80శాతం పెరిగినట్టు WHO ప్రకటించింది. ఈ వ్యవధిలో మొత్తం 15లక్షల కరోనా కేసులు రికార్డవగా.. అందులో 12లక్షల కేసులు దక్షిణకొరియాలోనే నమోదయ్యాయి. అటు కొత్త వేరియంట్ EG.5తో బ్రిటన్, అమెరికాలో కేసులు పెరుగుతుండగా.. ప్రస్తుతానికైతే ఇండియాకు ముప్పు లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Translate this News:











