Raksha Bandhan celebrating nations : రక్షా బంధన్ లేదా రాఖీ విస్తృతంగా జరుపుకునే భారతీయ పండుగలలో ఒకటి. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగలో అక్కా, చెల్లెల్లు అన్నలు, తమ్ముల మణికట్టుకు రాఖీలు కడతారు. ఇది ఇండియా అంతా జరుపుకొనే పండుగ..ముఖ్యంగా పెళ్లి అయిన అక్కా, చెల్లెళ్లు తమ తమ్ముడు లేదా అన్నల దగ్గరకు వెళ్లి రాఖీ కడుతుంటారు. అయితే ఇదంతా కేవలం ఇండియాలోనే జరగదు.. మిగిలిన దేశాల్లోనూ జరుగుతుంది. రక్షా బంధన్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు రాఖీ పండుగను జరుపుకుంటాయి:
అమెరికాలో రాఖీ:
భారతీయ జనాభా అమెరికాలో ఎక్కువగా స్థిరపడటంతో.. అక్కడి వారు ఈ పండుగను జరుపుకుంటారు. దేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోనూ పాటిస్తారు. రక్షా బంధన్ పండుగ అమెరికా పౌరుల దృష్టిని ఆకర్షించిన పండుగలలో ఒకటి.
Raksha Bandhan: ఇండియా కాకుండా ఏ ఏ దేశాల్లో రక్షా బంధన్ జరుపుకుంటారో తెలుసా?
రాఖీ పండుగ విశ్వవ్యాప్తమై చాలా ఏళ్లు అయ్యింది. ఇండియన్స్ ఎక్కుడ ఉంటే అక్కడ ఈ పండుగ కనిపిస్తుంది. భారతీయులను చూసి విదేశీయులు కూడా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ, నేపాల్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, మలేషియా దేశాల్లో రాఖీ పండుగ కనిపిస్తుంది.

Translate this News:











