భారత జట్టులో స్టార్ ప్లేయర్లా పేరు తెచ్చుకున్న బ్యాటర్ రిషబ్ పంత్. అతను వన్డే ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై చర్చ జరుగుతూనే ఉంది. కానీ పంత్ మునుపటిలా బ్యాట్ జులిపించాలంటే ఎక్కువ సమయం పడుతుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. పంత్ వన్డే ప్రపంచకప్ టీమ్‌లో లేకపోతే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. పంత్‌కు ప్రత్యామ్నాయ కీపర్లుగా కేఏల్ రాహుల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లు ఉన్నారు. కానీ సంజూ శాంసన్ రాణించలేకపోతున్నాడు. దీంతో బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. పంత్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను అతనికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..World Cup: వన్డే వరల్డ్ కప్‌లో పంత్ పరిస్థితి ఏంటి.?
రానున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత స్టార్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న కీపర్ రిషబ్ పంత్ మైదానంలోకి దిగబోతున్నాడా..? పంత్ ఆడకపోతే ప్రత్యామ్నాయ కీపర్ ఎవరు..? ఇతర క్రికెటర్లపై మాజీల అభిప్రాయాలు ఆసక్తికరంగా మారాయి.

Translate this News:











