
జూలై 17, 18 రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా జరిగిన విపక్షాల సమావేశానికి సీఎం కేసీఆర్ ఎందుకు దూరమయ్యారు..? కేసీఆర్కు ఆహ్వానం అందినా వెళ్లలేదా..? బీఆర్ఎస్ను కాంగ్రెస్తో సహా మిత్రపక్షాలు పిలువలేదా..? ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. గతంలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్లో జరిగిన సమావేశానికి సైతం బీఆర్ఎస్ దూరమైంది. ఆ సమావేశం ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయనే వార్తలకు చెక్ పడింది. బీఆర్ఎస్ను తాము కావాలనే పిలువలేదని కాంగ్రెస్ అంటే.. తామే కాంగ్రెస్ పార్టీ వస్తే తాము రామని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. దీంతో గతంలో విపక్షాల ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ బెంగళూరు సమావేశం ద్వారా కాంగ్రెస్తో దోస్తీకి కటీఫ్ చెప్పినట్లైంది.
పూర్తిగా చదవండి..











