పీహెచ్డీ అడ్మిషన్ విషయంలో మెరిట్ పాటించడంలేదని కాకతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ యూనివర్సిటీ వీసీని కలిసేందుకు వెళ్లిన బీసీ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. వర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్.. బీఆర్ఎస్కు వీసీ రమేష్ తొత్తుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యల గురించి అధ్యాపకులతో మాట్లాడి వాటిని పరిష్కరించుకునే సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు. కానీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విద్యార్థులను కొట్టడం తెలంగాణ చరిత్రలో లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Etala Rajender: మాట్లాడటానికి వెళ్లిన వారిపై దాడి చేయడం ఎంటి ?
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్డీ అడ్మిషన్ విషయంలో మెరిట్‌పై మాట్లాడటానికి వెళ్లిన విద్యార్థి నేతలపై పోలీసులు దాడి చేయడం ఎంటన్నారు. వర్సిటీ వీసీ విద్యార్థులను కొట్టించారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

Translate this News:











