మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును సీఎం కేసీఆర్ అవసరానికి వాడుకొని వదిలేశారని ఈటల రాజేందర్ అన్నారు. తుమ్మల బీజేపీలోకి వస్తే తాము స్వాగతిస్తామని ఆయన తెలిపారు. ఆయన కమలం వైపు ముగ్గు చూపితే పాలేరు టికెట్‌పై చర్చిస్తామన్నారు. కేసీఆర్ అనేక మంది నేతలను మోసం చేశారన్న ఆయన.. కేసీఆర్ చేతిలో మోసపోయిన వ్యక్తుల్లో తాను కూడా ఉన్నానన్నారు. కేసీఆర్‌కు బుద్ది చెప్పాలంటే తుమ్మల లాంటి నేతలు బీజేపీకి అవసరమన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు పార్టీలోకి వస్తే పార్టీ బలపడే అవకాశం ఉందన్నారు.
పూర్తిగా చదవండి..Etela Rajender: తుమ్మల పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం
సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎంతో మంది రాజకీయ నాయకులను వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వర్ రావును సైతం అలానే మోసం చేశారన్నారు. తుమ్మల బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని ఈటల స్పష్టం చేశారు.

Translate this News:











