Telangana Weather: తెలంగాణ ప్రజలకు హైఅలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ(IMD Hyderabad). తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం(Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నాలుగు రోజులకు సంబంధించి వాతావరణ నివేదికను విడుదల చేసిన వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. సోమవారం నాడు రాష్ట్రంలోని మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Weather: తెలంగాణ ప్రజలకు అరల్ట్.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..
నాలుగు రోజులకు సంబంధించి వాతావరణ నివేదికను విడుదల చేసిన వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు.

Translate this News:











