Andhra Pradesh Weather Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ(IMD). రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం.. పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిస్సా తీరానికి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇక అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవిరించి ఉన్నట్లు వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. మరో రెండు రోజుల్లో దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఒడిస్సా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అయితే, దీని ప్రభావంతో ఏపీలో రాగల మూడు రోజులపాటు వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరి వర్షాలు ఎక్కడెక్కడ పడుతాయో ఓసారి తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Rain Alert in AP: ఆంధ్రప్రదేశ్ వాసులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్..!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ(IMD). రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Translate this News:











