సుప్రీంకోర్టు నిన్న సంచలన తీర్పును వెలువరించింది. సేమ్ జెండర్ వివాహాలను చట్టబద్దం కాదని తేల్చి చెప్పింది. వివాహ హక్కుల నిర్ధారణకు ప్రభుత్వం కమిటీ వేయాలని ఆదేశించింది. అసహజంగా జరిగే వివాహాల పట్ల, వ్యక్తుల పట్ల వివక్ష ఎవరూ వివక్ష చూపకూడదని అంది. స్వలింగ సంపర్కుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నామని కోర్టు ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Same sex marriage:మా పోరాటం ఆగిపోదు..సుప్రీంకోర్టు ముందే ఉంగరాలు మార్చుకున్న స్వలింగ జంట
స్వలింగ వివాహాలకు నో చెబుతూ నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని చెప్పింది. స్వలింగ వివాహాం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. అలా పెళ్ళి చేసుకోవడం వారి ప్రాథమిక హక్కు కాదని తెల్చి చెప్పింది. దీంతో భారత దేశంలో స్వలింగ సంపర్కులు తీవ్ర నిరాశ చెందారు. ఓ స్వలింగ జంట అయితే ఏకంగా కోర్టు ఎదుటే తమ నిరసనను తెలిపారు. ఉంగరాలు మార్చుకుని తమ నిశ్చితార్ధం చేసుకున్నారు.

Translate this News:











