అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్ దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణ ప్రగతి సాధిస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రజలను అయోమయానికి గురిచేయాలని చూస్తున్నారన్నారు. 24 గంటల విద్యుత్‌పై కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని దశాబ్దాలుగా కొట్లాడినట్లు గుర్తు చేసిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడిన అనంతరం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని గుర్తు చేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. 4 లక్షల 1 వేయి పైచిలుకు ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రికార్డు తమదన్నారు.
పూర్తిగా చదవండి..దేశం ఆశ్చర్యపోయేలా చేస్తాం: సీఎం కేసీఆర్
విపక్షాలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పరిస్థితి, తెలంగాణ పరిస్థితి ఎలాగుందో చూసుకోవాలన్నారు. ప్రగతిలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ దరిదాపుల్లో లేవని స్పష్టం చేశారు.

Translate this News:











