సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు రాష్ట్రంలో మూడోదశ ఉద్యమం చేపడుతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ లక్ష్యణ్ ప్రకటించారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ప్రజలు కృంగి, కృషించి పోయారన్న ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర తరహా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హైదరాబాద్లో మీడియతో మాట్లాడిన ఆయన.. “కేసీఆర్ హటావో తెలంగాణ బచావో బీజేపీకా జితావో” అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని, రుణాలు మాఫీ కాక.. తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో విద్యా, వైద్యానికి డిమాండ్ పెరిగిందని, రోగాలతో బాధపడుతున్న ప్రజలు ఆస్పత్రికి వెళ్లాలంటే ఆస్పత్రి యాజమాన్యం వేసే బిల్లులను చూసి భయాందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.
పూర్తిగా చదవండి..MP Laxman: కేసీఆర్ హటావో తెలంగాణ బచావో.. బీజేపీకా జితావో
సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు రాష్ట్రంలో మూడోదశ ఉద్యమం చేపడుతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ లక్ష్యణ్ ప్రకటించారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ప్రజలు కృంగి, కృషించి పోయారన్న ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర తరహా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Translate this News:











