నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవడంలేదు. దీని వల్ల వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి గారికి పలు విజ్ఞప్తులు చేస్తుండడంతో ఈరోజు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సాగర్ ఎడమ కాలువ కింద వరి పంటలకు సాగునీరు అందించే విషయంపై చర్చించారు.
పూర్తిగా చదవండి..Nagarjuna sagar: రేపటి నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల- సీఎం నిర్ణయం!
తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో మన నీరు ఉండడంతో రేపటి నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. ఇక ఈ నెల(అక్టోబర్)లో తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

Translate this News:











