Mamata Banerjee Goes For Morning Jog In Saree : 68 ఏళ్ల దీదీ జాగింగ్ చేస్తూ అదరగొట్టారు. చీరలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పరుగులు పెట్టారు. చాలా మంది జాగింగ్ చేయడానికి దానికి సంబంధించిన సూట్ ధరిస్తారు. దీదీ మాత్రం ఎప్పటిలాగే తన వస్త్రధారణతోనే జాగింగ్ చేశారు. మమతా బెనర్జీ(Mamata Banerjee) చీర, చెప్పులు ధరించి మార్నింగ్ జాగ్ కోసం వెళుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. స్పెయిన్ పర్యటనలో ఉన్న దీదీ జాగింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మమత ప్రస్తుతం బెంగాల్‌కి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దుబాయ్, స్పెయిన్లకు వెళ్లారు. 12 రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో పర్యటన ప్రారంభమవగా.. ఇప్పటికే అనేక వ్యాపార సమావేశాలను నిర్వహించారు దీదీ.
పూర్తిగా చదవండి..Mamata viral Video: చీరతో, చెప్పులు ధరించి మమత బెనర్జీ పరుగులు.. పియానో వాయించిన దీదీ!
మమత బెనర్జీ చేయలేనిది ఏదైనా ఉందా? రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులను ఉరుకుల పరుగుల పెట్టే పశ్చమబెంగాల్ సీఎం దీదీ నిజజీవతంలో ఫిట్‌గా ఉండటానికి జాగింగ్ చేస్తారు. ప్రస్తుతం స్పెయిన్ పర్యటనలో ఉన్న మమత చీరతో, చెప్పులు ధరించి జాగింగ్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అటు దీదీ పియానో వాయిస్తున్న వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది

Translate this News:











