YCP Flexi Issue : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం జనుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిచి.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. సభ అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారిగా జిల్లా కేంద్రం అమలాపురం వస్తున్న సీఎం పర్యటనకు ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. సీఎం సభలో సుమారు లక్ష మంది పాల్గొనేలా ఏర్పాటు చేశారు. తొలుత సభావేదిక వద్ద ముందస్తు భద్రతా తనిఖీ నిర్వహించారు వైసీపీ నేతలు.
పూర్తిగా చదవండి..YCP Flexi Issue : అమలాపురంలో ఫ్లెక్సీల వార్.. వైసీపీ ఆగ్రహం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వార్ నడుస్తోంది. అమలాపురం సీఎం జగన్ పర్యటన సందర్భంగా మంత్రి విశ్వరూప్ కుటుంబంలో ఫ్లెక్సీలు వార్ నెలకొంది. మంత్రి కుమారులు వేరువేరుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి విశ్వరూప్ ఫోటో కనిపించపోవటంతో ఇప్పుడు ఫ్లెక్సీల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Translate this News:











