మీరు వొడాఫోన్ ఐడియా(VI)యూజర్లా? మీ సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉంది. అదేంటి..? మేమేం తప్పు చేశాం..బిల్లు కడుతున్నాం కదా అని ఆలోచిస్తున్నారా? మీరు బిల్లు కడుతున్నారన్నది నిజమే కావొచ్చు. మీరు బిల్లు కట్టకపోతే ఒక నిమిషం కూడా మీ ఫోన్ అవుట్గోయింగ్ నిలిపివేసే నెట్వర్కింగ్ సంస్థలు తమ పని మాత్రం తాము చేయవు. అంటే బిల్లులు కట్టవు.. బకాయిలు పెట్టేస్తాయి. నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు యూజర్లపై అధిక ధరలు బాదే కంపెనీలు చెల్లింపుల విషయంలో మాత్రం పిసినరిగా ఉంటాయని అనేక సందర్భాల్లో తేలింది. మరోసారి అదే ప్రూవ్ అయ్యింది.
పూర్తిగా చదవండి..Vodafone Idea: బకాయిలు చెల్లించండి.. లేకపోతే సర్వీస్ ఫసక్ అవుతుంది.. వొడాఫోన్ ఐడియాకు వార్నింగ్!
వొడాఫోన్ ఐడియా(వీఐ)కి గడ్డుకాలం నడుస్తోంది. ఇండస్ టవర్స్ డబ్బుల చెల్లింపులో వేల కోట్ల బాకీ పడిపోయిన వీఐ తన సర్వీసులను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. బాకీలు చెల్లించకపోతే వీఐ సర్వీసులను పరిమితం చేస్తామని ఇండస్ టవర్స్ ట్రాయ్‌కి చెప్పింది. ఇదే జరిగితే వొడాఫోన్ ఐడియా యూజర్లు ఎయిర్టెల్, జియో లేదా ఇతర నెటవర్క్లకు షిఫ్ట్ అయ్యే అవకాశాలుంటాయి.

Translate this News:











