Viswakarma Yojana Scheme Benefits: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, చేతివృత్తుల మీద ఆధారపడి ఉందని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. గత పాలనలో కుల, చేతి వృత్తుల వర్గాలను విస్మరించి, కనీస శ్రద్ధ చూపలేదన్నారు. నైపుణ్యత ఆసరాగా అనాదిగా వృత్తిలో కొనసాగుతున్నారని, భూములు కోల్పోయారని అన్నారు. పెట్టుబడి దారులకు, పెత్తందారులకు పెద్ద పీట వేసే నేటి పోటీ ప్రపంచంలో కుల వృత్తుల వారు తమ వృత్తి లోనే ఉంటూ దుర్భరమైన జీవితాన్ని నెట్టుకొస్తున్నారని అన్నారు. చేతి వృత్తుల వారి జీవితాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. తానే పెద్ద దిక్కుగా నిలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. కుల వృత్తులను ఆధునీకరించి, ఆర్థిక సాయం అందించి, ఆధునిక పరికరాలు అందించే విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చారని చెప్పారు.
పూర్తిగా చదవండి..Telangana: విశ్వకర్మ యోజనతో రూ. 3 లక్షల రుణం.. కీలక వివరాలు వెల్లడించిన ఎంపీ లక్ష్మణ్..
విశ్వకర్మ జయంతి సందర్భంగా అనేక వృత్తుల్లో ఉన్న వివిధ వర్గాల వారి జీవితాలలో వెలుగు నింపే కార్యక్రమమే ప్రధాని విశ్వకర్మ యోజన పథకం అని పేర్కొన్నారు ఎంపీ లక్ష్మణ్.

Translate this News:











