Virat Kohli About Rumours: టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పాన్సర్డ్ పోస్టుకు ఏకంగా రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్త హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. హోపర్ హెచ్‌క్యూ అనే కంపెనీ విడుదల చేసిన ఈ నివేదికపై తాజాగా కోహ్లీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. “జీవితంలో నేను అందుకున్న ప్రతిదానికి రుణపడి ఉంటాను. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అయితే నా సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదు” అని స్పష్టంచేశాడు. అయితే నిజంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న భారత ఆటగాడు విరాట్ కోహ్లీనే కావడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి ఏకంగా 25.5 కోట్ల ఫాలోయర్లు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Virat Kohli :ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు రూ.11.45కోట్లు.. కోహ్లీ ఏమన్నాడంటే?
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పాన్సర్డ్ పోస్టుకు రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలపై టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. జీవితంలో తాను అందుకున్న ప్రతిదానికి రుణపడి ఉంటానని తెలిపాడు. ఇంకా ఏం అన్నాడంటే..

Translate this News:











