ట్రాక్టర్ ఢీ కొట్టడంతో వైద్యుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని భీంగల్ మండల పరిధిలోని మెండోర గ్రామానికి చెందిన కాంటం రాజు వృతి రీత్యా ఆర్ఎంపీ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. జూలై 30న రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న వైద్యుడిని వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్ఎంపీ డాక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..Mendora: అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు.. అసలు ఏమైందంటే
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల పరిధిలోని మెండోర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొనడంతో ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ట్రాక్టర్ యాజమాని ఇంటిముందు ఆందోళనకు దిగారు.

Translate this News:











