వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో జోరుగా కార్ రేసింగ్ జరుగుతోంది. నిన్న (అగస్టు 15)న సెలవు రోజు కావడంతో అనంతగిరి కొండలకు భారీగా వెళ్లిన యువతీ, యువకులు కార్ల రేసింగ్ నిర్వహించారు. సైరన్ వేసుకుంటూ దూసుకువచ్చి విన్యాసాలు నిర్వహించి ఫుల్ హంగామా చేశారు. బైక్‌లతో స్టంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలకు తీసి మరి పలువురు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్ నిర్వహించడంపై స్థానికులు, అధికారులు మండిపడుతున్నారు.
పూర్తిగా చదవండి..అనంతగిరి కొండల్లో జోరుగా కార్, బైక్ రేసింగ్‌లు.. దుమ్ము రేపారుగా
వికారాబాద్‌లో రేసింగ్‌ల రచ్చ చేస్తున్నారు. అనంతగిరి కొండల్లో జోరుగా కార్, బైక్ రేసింగ్‌లతో దుమ్ము రేపుతున్నారు రేసింగ్ రాయుళ్లు. అడవుల్లోకి వాహనాలకు అనుమతి లేకున్నా ..డబ్బులు తీసుకొని అటవీశాఖ అధికారులే వదిలేశారని ఆరోపణ చేస్తున్నారు. రేసింగ్‌లతో స్థానికులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Translate this News:











