Will Vangaveeti Radha going to join Janasena? : ఏపీ(AP)లో ఎన్నికలకు 8-9 నెలల సమయమే ఉండడంతో వంగవీటి రాధ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందులోనూ వచ్చే ఏడాది ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకం కానున్నాయి.. విజయవాడ గడ్డపై చెరగని ముద్ర వేసిన వంగవీటి కుటుంబం ఈ సారి ఏ పార్టీ తరుఫున నిలబడుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొన్న వేళ.. ఇవాళ (ఆగస్టు 10) తన ముఖ్య అనుచరులతో వంగవీటి రాధ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.
Radha: బెజవాడ రాజకీయాలు.. వంగవీటి దారెటు..? అనుచరులతో రాధ సమావేశం
బెజవాడ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు వంగవీటి రాధా రెడీ ఐనట్టే కనిపిస్తోంది. ఇవాళ (ఆగస్టు 10) తన అనుచరులతో రాధా భేటీ కానున్నారు. ఈ మీటింగ్ తర్వాత రాధా రాజకీయ అడుగులు ఎటువైపన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాధా జనసేనలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు నారా లోకేశ్ పాదాయాత్ర కోసమే ఈ మీటింగ్ అని మరో వాదన వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే లోకేశ్ పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Translate this News:











