దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మొదటి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుండటంతో ఇంద్రకీలాద్రి సందడిగా మారింది. ఈ సందర్భంగా..ఇంద్రకీలాద్రిపై క్యూలైన్స్ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. క్యూ లైన్లతో భక్తులు ఇబ్బంది పడటంతో ఈవో, పోలీసులు, అధికారులపై కొట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 500ల టికెట్ క్యూలైన్ గంటల తరబడి కదలకపోవడంపై కొట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లోని భక్తులు మంత్రి కొట్టుకు ఫిర్యాదు చేశారు. ఈవో రామారావును పిలిచి ఏం చేస్తున్నావ్..? అంటూ ప్రశ్నించారు. నా చుట్టూ తిరగడం కాదు, ముందు గుడి మీద అవగాహన పెంచుకో అంటూ మంత్రి కొట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత క్యూలైన్లోని భక్తులను రూ.500ల టికెట్ క్యూ లైన్లో పంపడంపై మంత్రి ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Minister Kottu satyanarayana: దుర్గగుడిలో ఏర్పాట్లపై ఏపీ మంత్రి ఆగ్రహం
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నేడు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మొదటి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో భక్తుల క్యూ లైన్లను మంత్రి పరిశీలించారు.

Translate this News:











