Chandrababu Arrest Updates: చంద్రబాబుకు సీఐడీ కస్టడీకి అప్పగించడంపై ఏసీబీ కోర్టు(ACB Court) ఇవాళ తీర్పు వెల్లడించనుంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు(Chandrababu) కస్టడీ పిటిషన్పై తీర్పును వెలువరించనున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. అయితే, ఈ కేసులో పెద్ద కుట్ర దాగుందని, దానిని వెలికి తీయాలంటే.. చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాల్సిందేనని సీఐడీ తరఫున న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. ఇకపోతే.. ఇప్పటికే విచారణ ముగిసి రిమాండ్ ఖైదీగా ఉన్నారని, ఇక కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేశారు. అయితే, ఇవాళ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: చంద్రబాబు కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు.. ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..
చంద్రబాబుకు సీఐడీ కస్టడీకి అప్పగించడంపై ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు చంద్రబబు కస్టడీ పిటిషన్పై తీర్పును వెలువరించనున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. అయితే, ఈ కేసులో పెద్ద కుట్ర దాగుందని, దానిని వెలికి తీయాలంటే.. చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాల్సిందేనని సీఐడీ తరఫున న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు.

Translate this News:











