INDIA’s First Moon Walk: చంద్రయాన్-3 (Chandrayaan-3)మిషన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) ఎలా దిగింది అనే వీడియో (Video)ను ఇస్రో విడుదల చేసింది. ISRO చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. ల్యాండ్ అయిన రెండు రోజుల తర్వాత ఇస్రో ఈ చారిత్రక వీడియోను విడుదల చేసింది. చంద్రయాన్-3 ల్యాండర్ లోపల నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ఎలా బయటకు వచ్చిందో ఈ వీడియోలో చూడవచ్చు. ల్యాండర్ యొక్క ర్యాంప్ ద్వారా రోవర్ చాలా తేలికపాటి వేగంతో చంద్రుని ఉపరితలంపై దిగినట్లు ఇందులో చూడవచ్చు. ‘చంద్రయాన్ -3 రోవర్ ల్యాండర్ నుండి వడి వడి అడుగులు వేస్తోంది…ఇప్పుడు భారత్ చంద్రునిపై నడుస్తోంది అంటూ ఇస్రో ట్వీట్ చేసింది.
పూర్తిగా చదవండి..INDIA’s First Moon Walk: వావ్…జాబిల్లిపై వడివడిగా అడుగులు వేస్తోన్న రోవర్, వీడియో వైరల్..!!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం ఓ వీడియోను విడుదల చేసింది. చంద్రయాన్-3 రోవర్ ల్యాండర్ నుంచి చంద్రుని ఉపరితలంపైకి ఎలా నెమ్మదిగా దిగిపోతుందో ఈ వీడియోలో చూడవచ్చు.ఇస్రో ట్విట్టర్ లో చంద్రయాన్-3 రోవర్ ల్యాండర్ నుండి దిగిపోయిందని, జాబిల్లిపై భారత్ నడిచందని ఇస్రో పోస్టు చేసింది. చంద్రయాన్-3 ఆగస్టు 23 సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది.

Translate this News:











