సుప్రీంకోర్టు ఈరోజు సంచలన తీర్పు వెలువరించనుంది. స్వలింగ వివాహానికి చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కీలక ఆదేశాలివ్వనుంది. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం మే 11న.. 10 రోజుల విచారణ తర్వాత తీర్పును రిజర్వు చేసింది. అయితే ఈ విచారణలో పిటీషనర్లు తమ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలని అభ్యర్థించారు. మరోవైపు స్వలింగ సంపర్కులకు వివాహ హోదా ఇవ్వకుండా కొన్ని హక్కులు కల్పించడానికి పరిగణించవ్చచని కేంద్రం పేర్కొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గతంలో సుప్రియో చక్రవర్తి – అభయ్ డాగ్, పార్థ్ ఫిరోజ్ – ఉదయ్ రాజ్ ఆనంద్ లాంటి పలువురు స్వలింగ సంపర్కుల జంట పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 20 పైగా పిటిషన్లు స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని పట్టుబట్టాయి. ప్రత్యేక వివాహ చట్టంలో మతాంతర, కులాంతర వివాహాలుకు రక్షణ ఉందని.. స్వలింగ సంపర్కుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ పిటిషనర్లు ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహాలపై నేడు తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు..
స్వలింగ వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించనుంది. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం మే 11న.. 10 రోజుల విచారణ తర్వాత తీర్పును రిజర్వు చేసింది. అయితే ఈ విచారణలో పిటీషనర్లు తమ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

Translate this News:











